BREAKING : హీరోయిన్ సమంతకు తీవ్ర గాయాలు ?

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు షూటింగ్ లో గాయమైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో రాబోయే హిందీ సిరీస్ ‘సిటాడేల్’ షూటింగ్ యాక్షన్ కోసం సమంత శిక్షణ పొందుతోంది. అయితే, సెట్స్ లో ఆమె చేతికి గాయం అయిందని తెలిపే ఫోటోను సమంత తన అకౌంట్ లో పంచుకుంది.

ఆమె చేతులకు గాయాలు, రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. యాక్షన్ సీన్స్ కోసం ఇంతలా కష్టపడుతుందని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. కాగా, హీరోయిన్ సమంత గత కొన్నాళ్ల నుంచి శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలకు సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే, సమంత అనారోగ్యం బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ షూటింగ్ లో పాల్గొంటుంది.

https://www.instagram.com/stories/samantharuthprabhuoffl/3047896378256436725/

Read more RELATED
Recommended to you

Latest news