యువత సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరశురాం రీసెంట్ గా వచ్చిన గీతా గోవిందం సినిమాతో దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. విజయ్ కెరియర్ లోనే కాదు పరశురాం కెరియర్ లో కూడా గీతా గోవిందం సెన్సేషనల్ హిట్ అయ్యింది. గీతా గోవిందం సినిమాకు ముందు శ్రీరస్తు శుభమస్తు సినిమాతో కూడా పరశురాం హిట్ కొట్టాడు.
అతని డైరక్షన్ లో సినిమాలకు మినిమం గ్యారెంటీ అనిపించుకున్న ఈ దర్శకుడు గీతా గోవిందం 100 కోట్ల మార్క్ అందుకోగా స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ప్రస్తుతం తన తర్వాత సినిమా ప్రయత్నాల్లో ఉన్న పరశురాంకు ఓ ప్రముఖ నిర్మాత 10 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చాడట. శ్రీరస్తు శుభమస్తు, గీతా గోవిందం రెండు సినిమాలు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేశాడు పరశురాం.
తన తర్వాత సినిమా కూడా ఈ సంస్థలోనే ఉంటుందని అనుకున్నారు కాని ఫ్యాన్సీ ఆఫర్ రావడంతో పరశురాం గీతా ఆర్ట్స్ నుండి బయటకు వచ్చి ఈ సినిమా చేస్తున్నాడట. మరి ఆ నిర్మాత ఎవరు ఏ హీరోతో సినిమా చేస్తారన్న విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.