బాలీవుడ్ అతిపెద్ద బాక్సాఫీసు.. అక్కడ ఇమేజ్ లభించింది అంటే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభిస్తుంది అని.. ప్రస్తుతం టాలీవుడ్ , కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా బాలీవుడ్లో నటించాలని ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే అవకాశాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఇప్పటికే సమంత, పూజా హెగ్డే , రష్మిక మందన్న లాంటి స్టార్ హీరోయిన్లు కూడా బాలీవుడ్లో నటిస్తూ అక్కడ క్రేజ్ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా బాలీవుడ్లో నటించాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి కూడా ఇదే బాట పట్టింది.
అనుకున్నట్టుగానే బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంది. కానీ అవమాన పరిచారు అని బాలీవుడ్ సినిమాలే వదులుకుంది కృతి శెట్టి. అసలు ఏమైందనే విషయానికి వస్తే.. బాలీవుడ్ లో అందాదున్ తీసిన దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ త్వరలో ఒక సినిమాను తీయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ని తీసుకోవాలనుకున్నారట. కృతి శెట్టి కి కూడా సినిమా కథ వినిపించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షూటింగ్ కూడా మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ముందుగా ముంబైకి వచ్చి ఆడిషన్ ఇవ్వమని అన్నారట చిత్ర బృందం.
అయితే కొత్త హీరోయిన్ మాదిరిగా ఆడిషన్ అనేసరికి ఆమెను అవమానపరిచినట్టు ఆమె ఫీల్ అయిందట. అంతే ఆఫర్ ను వదులుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ.. ప్రస్తుతం ఈమె పై ఇలాంటి వార్తలు వస్తూ ఉండడం గమనార్హం. ఉప్పెన, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ లను చవిచూసింది ప్రస్తుతం నాగచైతన్యతో ఒక సినిమా మాత్రమే ఈమె చేతిలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈమె బాలీవుడ్ ఆఫర్ ని వదులుకోవడం ఏంటి? అంటూ కూడా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే కృతి శెట్టి స్పందించాల్సి ఉంటుంది.