రాంగోపాల్ వ‌ర్మాకు బిగ్ షాక్‌.. నేడు ‘సైబర్‌ క్రైం’ ఎదుటకు..

-

అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాపై అభ్యంతరం చెబుతూ… ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ కంప్లైంట్ ఇవ్వడంతో… హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు నోటీస్ పంపారు. ఈ రోజు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట 11 గంట‌ల‌కు హాజరు కావాలని ఆదేశించారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకి సంబంధించి తన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేశారని కేఏ పాల్ తన కంప్లైంట్‌లో తెలిపారు. ఈ సినిమాకి సంబధించిన సెన్సార్ సర్టిఫికెట్‌ను కే ఏ పాల్… వర్మకు నవ్వుతూ ఇస్తున్నట్లుగా ఓ ఫొటో సోషల్ మీడియాలో రిలీజైంది.

నిజానికి ఇది కే ఏ పాల్ రాష్ట్రపతిని కలిసినప్పటి ఫొటో. దాన్ని మార్ఫింగ్ చెయ్యడంపై ఆయన అభ్యంతరం చెబుతున్నారు. ఈ క్రమంలోనే వీళ్ళ ముందు హాజరు కాబోతున్నాడు వర్మ. మరోవైపు తాను కూడా కేఏ పాల్‌పై పరువునష్టం దావా వేస్తానని చెబుతున్నాడు ఆర్జీవీ. ఇక ఆ‎మ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విషయానికి వచ్చే సరికి సినిమా మొదలు నుండే చాలా వివాదాలను సృష్టిస్తూ వచ్చింది ఈ సినిమా. టైటిల్ నుంచి, ట్రైలర్ వరకు అన్ని వివదాస్పదంగా మారిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news