దక్షినాదిలో బలపడాలి అనేది బిజెపి వ్యూహం… తమ పార్టీకి క్యాడర్ లేకపోయినా సరే క్రమంగా బలపడి… ఇతర పార్టీల క్యాడర్ ని వాడుకుని పొత్తులు, స్నేహాలతో ముందుకి వెళ్దామని భావిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏపీలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ఆ పార్టీలో ఉన్న బలమైన మాజీ నేతల మీద ఎక్కువగా దృష్టి సారిస్తూ వస్తుంది. ఇప్పటికే ఆర్ధికంగా బలవంతులు అనే పేరున్న… నలుగురు రాజ్యసభ ఎంపీలను బిజెపి… జాయిన్ చేసుకుంది. ఇక మాజీ మంత్రిని, మాజీ ఎమ్మెల్యేని కూడా పార్టీలోకి తీసుకుంది.
ఇది పక్కన పెడితే పార్లమెంట్ సమావేశాలు మొదలైన నాటి నుంచి బిజెపి… అధికార వైసీపీ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఈ తరుణంలో నర్సాపురం ఎంపీగా ఉన్న కనుమూరి రఘు రామకృష్ణం రాజు మీద దృష్టి పెట్టారు. ఆయన ఊ అంటే బిజెపి నేతలతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా బిజెపి కేంద్ర మంత్రులకు భీమవరం వంటల రుచి ఢిల్లీ సాక్షిగా చూపించారు. దీనితో ఇప్పుడు వైసీపీ జాగ్రత్త పడటం మొదలుపెట్టింది. వైసీపీ ట్రబుల్ షూటర్ గా పేరున్న విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు…
వెంటనే… రఘు… సొంత బావ గోకరాజు గంగరాజు కుటుంబాన్ని తమ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న హిందుత్వ నేతలను అందరిని కూడా తమ పార్టీలోకి తీసుకోవాలని విజయసాయి భావిస్తున్నారు. కీలక నేతలుగా పేరున్న వారి మీద దృష్టి పెట్టిన విజయసాయి వారితో మాట్లాడుతున్నారు. విశాఖ జిల్లాలో కీలకంగా ఉన్న హరిబాబు కూడా ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఆర్ ఎస్ ఎస్ తో సంబంధం ఉన్న నేతలకు వెంటనే పదవులు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉంది వైసీపీ అధిష్టానం… రాష్ట్రంలో బలపడటానికి తనను బిజెపి టార్గెట్ చేయడం నచ్చని జగన్… వీలైనంత త్వరగా ఏపీ బిజెపిని కాళీని చెయ్యాలని భావిస్తున్నారు.