జబర్దస్త్ పై మెగా ఫాన్స్ ఫైర్, నాగబాబుని అనే రేంజ్ కి ఆది వెళ్ళాడా…?

-

అదిరింది, జబర్దస్త్… ఈ రెండు షో ల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి పెరిగిపోతుంది. నాగాబాబు జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్ళడం ఏమో గాని షో లో పాల్గొనే నటులు మాత్రం ఆయన్ను టార్గెట్ గా చేసుకుని పంచ లు వేస్తున్నారు. నాగబాబు కూడా ఎం తక్కువ తినలేదు. జబర్దస్త్ నిర్మాతల కార్పోరేట్ కల్చర్ నచ్చక వచ్చేసా అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడమే కాకుండా అదిరింది స్కిట్ లో జబర్దస్త్ పై పంచ్ లు ఉంటున్నాయి.

దీనితో జబర్దస్త్ షో నిర్వాహకులు నాగబాబుకి ఒక షాక్ ఇచ్చారు. అదిరింది షో వచ్చే సమయానికి జబర్దస్త్ పాత స్కిట్‌లు వేసి నాగబాబుకి జలక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే జబర్దస్త్ లో పాల్గొనే హైపర్ ఆది తాజాగా ఒక పంచ్ వేసారు. గురువారం వచ్చిన జబర్దస్త్‌లో హైపర్ ఆది వేసిన స్కిట్‌లో ఓ సందర్భంలో హైపర్ ఆది కోఆర్టిస్ట్ ఒకరు, మిగతా కంటెస్టంట్‌లను ఉద్దేశించి నగల్ని, చీరల్ని, వీళ్లని తీసుకెళ్తా అని డైలాగ్ వేస్తాడు.

వెంటనే కలుగ జేసుకున్న ఆది… షాకింగ్ పంచ్ ఇచ్చాడు. “ఆ తీసుకెళ్లురా, మమ్మల్ని, యాంకర్లను, జడ్జిలను తీసుకెళ్లి.. నువ్వు కూడా ‘కుదిరింది’అని ఒక షో పెట్టుకో.” అంటూ నాగబాబు టార్గెట్ గా పంచ్ వేసాడు. దీనితో జడ్జి గా ఉన్న రోజా షాక్ అయ్యారు. నోటికి చేతిని అడ్డం పెట్టుకుని నవ్వుతారు. ప్రస్తుత౦ దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దీనితో మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. నాగబాబుకి పంచ్ వేసే స్థాయికి ఆర్టిస్ట్ వెళ్ళడా అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news