హరీష్ రావు పనితీరుకు నేను పెద్ద అభిమానిని – రాజమౌళి

-

నేడు బంజారాహిల్స్ లోని లిటిల్ స్టార్ అండ్ షీ ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. అదేవిధంగా ఆరోగ్య రంగంలో కూడా అభివృద్ధి చెందిందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారని.. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు. ఈ సందర్భంలోనే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు.

తెలుగు జాతి ఖ్యాతిని రాజమౌళి బాహుబలి సినిమాతో దేశవ్యాప్తం చేసి.. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తం చేశారని అన్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్, సెక్యూరిటీ వంటి విషయాల వ్యయం రెండేళ్ల పాటు భరిస్తామని ముందుకు వచ్చారని తెలిపారు. రాజమౌళి గారి సినిమాలలో ఇన్స్పిరేషన్ కనిపిస్తుందని, దేశభక్తి, సామాజిక స్పృహ కనిపిస్తుందన్నారు. ఇక రాజమౌళి మాట్లాడుతూ.. సిద్దిపేట ఒకప్పటికి ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. హరీష్ రావు పనితీరుకు తాను పెద్ద అభిమానిని అన్నారు రాజమౌళి.

Read more RELATED
Recommended to you

Latest news