నాటు నాటుకు ఆస్కార్ పై అల్లు అర్జున్ స్పందన ఏంటంటే..

-

అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం పై ఇప్పటివరకు ప్రతి ఒక్కరు స్పందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం స్పందించలేదని గుసగుసలు వినిపించాయి. కాగా తాజాగా ఈ విషయంపై ట్వీట్ చేస్తూ చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు బన్నీ..

95 వ ఆస్కార్ వేడుకలు మార్చి 13న అమెరికాలో డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ విషయంపై ఇప్పటి వరకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు సైతం స్పందించి తమ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ సైతం ట్విట్టర్ వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించలేదు. తాజాగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు బన్నీ..

ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్.. “భారతదేశానికి గర్వించే క్షణం. ఆస్కార్ వేడుకలో తెలుగు పాట షేక్ చేయడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవకు నా హ్రుదయపూర్వక అభినందనలు. ఇక ప్రపంచ మెచ్చేలా స్టెప్పులేసిన నా ప్రియమైన గ్లోబల్ స్టార్స్ లవ్లీ బ్రదర్ రామ్ చరణ్ కు, మన తెలుగు ఫ్రైడ్ తారక్ కు, అలాగే ఈ విజయానికి ఎంతో శ్రమించిన ఎస్ఎస్ రాజమౌళి గారికి అభినందనలు. ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ కు హార్ట్ టచ్చింగ్ మూమెంట్.. ” అని రసుకొచ్చారు. ఈ ట్వీట్ పై స్పందించిన దర్శకతీరుడు రాజమౌళి థాంక్యూ బన్నీ అంటూ రిప్లై ఇచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news