చీర కట్టులో.. ఆకాశాన్నే మురిపిస్తున్న రాములమ్మ..?

బుల్లితెర రాములమ్మగా మరింత పాపులారిటీని దక్కించుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ డ్రెస్ వేసినా సరే ఆ డ్రెస్ కే అందాన్ని తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. అంతలా తన లుక్స్ తో యువతను కట్టిపడేస్తూ ఉంటుంది. ముఖ్యంగా హాట్ కనిపించడం అందరూ చేసే పనే.. కానీ కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దామని అనుకుందో ఏమో తెలియదు కానీ వరుస పెట్టి గత మూడు రోజుల నుంచి రకరకాల చీరలతో మరింతగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ట్రెడిషనల్ వేర్ కు అద్దం పట్టే విధంగా రకరకాల దుస్తుల్లో సరికొత్త అందాలను ఆవిష్క్రుతం చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించి యువతలో ట్రెండ్ సెట్ చేయడానికి ప్రయత్నించే శ్రీముఖి బుల్లితెర తో పాటు సోషల్ మీడియాలో కూడా తన పాపులారిటీని మరింత పెంచుకుంది. అందుకే ఫ్యాషన్ కే హాట్ ట్రీట్ ఇస్తూ.. అప్పుడప్పుడు కొత్త అందాలతో సందడి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే కాస్త కొత్త లుక్ ట్రై చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా చీర కట్టులో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొన్నటి వరకు గ్లామర్ అందాలు వలకబోసిన శ్రీముఖి , ఉన్నట్టుండి నిండుగా జాకెట్ వేసుకొని చీర కట్టులో ఫోటోలకు ఫోజులిచ్చిన రాములమ్మని చూసి సోషల్ మీడియాలో నెటిజన్ లు ఫిదా అవుతున్నారు.

లైట్ బ్లూ కలర్ సారీ విత్ వైట్ కలర్ లేస్ తో లైట్ పింక్ కలర్ జాకెట్ ధరించిన శ్రీముఖిని ఈ దుస్తుల్లో చూసి ఆమె అందాలు వర్ణించడానికి కూడా సాధ్యం కానంతగా ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. చూడడానికి బొద్దుగా.. ముద్దుగా కనిపించే ఈమె ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. యాంకరింగ్ లో కూడా చెలరేగిపోతూ ఉంటుంది . ఈ క్రమంలోనే అందాల ఆరబోతతో మరింత రచ్చ చేస్తోందని చెప్పవచ్చు. ఈమె అందాలను చూసి చీర కట్టులో ఆకాశాన్నే మురిపిస్తోంది రాములమ్మ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)