అక్కినేని అమల గురించి అసలు ఎవరికీ తెలియని విషయాలివే..!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున..యంగ్ హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు. ప్రజెంట్ ‘ది ఘోస్ట్’ అనే మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఆయన భార్య అమల విషయానికొస్తే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలులు వెలిగిన అమల..ఇప్పుడు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ పిక్చర్ లో అమ్మ పాత్ర పోషించింది అమల.

నాగార్జున అమలను రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ విదితమే.దగ్గుబాటి లక్ష్మితో డైవోర్స్ తర్వాత నాగార్జున అమలను పెళ్లి చేసుకున్నాడు. ‘శివ’,‘నిర్ణయం’ చిత్రాలలో నాగార్జున, అమల జంటగా నటించారు. ఆ తర్వాత నిజ జీవితంలో జంటగా మారారు.

పెళ్లికి ముందర సినిమాలు చేసిన అమల..పెళ్లి తర్వాత కుటుంబానికే ప్రయారిటీ ఇచ్చింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కథానాయికగా నటించిన అమల..యాభైకి పైగా సినిమాల్లో కథానాయికగా నటించిందది. అమల కుటుంబం విషయానికొస్తే..అమల ఫాదర్ బెంగాలీ కాగా తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు. ఈ సంగతి చాలా మందికి తెలియదు.

అమల తండ్రి నేవీ ఆఫీసర్..ఆయన ఐర్లాండ్ దేశస్తురాలు అయిన అమల తల్లిని పెళ్లి చేసుకున్నారు. అమల ఫ్యామిలీ చెన్నై, వైజాగ్ లో నివసించింది. అమల సినిమాల్లోకి వచ్చిన క్రమంలో హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అలా తెలుగులో పలు సినిమాలు చేసిన అమల.. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అయిన నాగార్జున పెళ్లి చేసుకుంది. అయితే, వీరిరువురుది ప్రేమ వివాహం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.