పూరి ఫైటర్‌ లో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ నిజమేనా ..?

-

చాలాకాలం తర్వాత “ఇస్మార్ట్‌ శంకర్‌” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా ‘ఫైటర్‌’. ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. విజయ్‌ దేవరకొండ-పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఎక్కువశాతం ముంబయ్‌ ధార్వి లో ప్లాన్‌ చేశారు. అక్కడే షూటింగ్ కూడా జరిపారు.

 

అయితే ప్రస్తుతం ముంబై లో చేయాల్సిన షూటింగ్ మొత్తాన్ని హైదరాబాద్ లో కంప్లీట్ చేసేందుకు పూరి ప్లాన్ చేస్తున్నారట. లాక్ డౌన్ తర్వాత హైదరా బాద్ పరిసర ప్రాంతాలు..అలాగే స్టూడియోస్ లో సెట్ వేసి చిత్రీకరించనున్నారని తాజా సమాచారం. ఇక విజయ్‌ బాక్సార్‌గా కనిపించనున్న ఈ సినిమా టాకీ పార్ట్ ఇప్పటివరకు నలభైశాతం షూట్‌ చేశారు. ఇక ఈ సినిమాకోసం గోవా, బ్యాంకాక్ లలో అనుకున్న షెడ్యూల్స్ కూడా కరోనా కారణంగా క్యాన్సిల్ చేశారు పూరి జగన్నాధ్.

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఫైటర్ గా ఫిట్ బాడీతో మాస్ గా కనిపించే విజయ్.. క్లీన్ షెవ్ తో క్లాసీ లుక్ లోను కనిపించబోతున్నాడట. అయితే ఇది డ్యూయల్ రోల్ ఆ కాదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్ గా ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ ఇలా క్లాసీగా కనిపించేది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అని తెలుస్తుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news