మహేష్ బాబు కోసం మెగాస్టార్ రాబోతున్నారా…..??

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై రోజు రోజుకు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు మూడు సాంగ్స్ కు కూడా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 5న ఎంతో గ్రాండ్ గా జరుపబోతున్నట్లు సినిమా యూనిట్, మొన్న ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకుల మధ్య ఎంతో వైభవంగా జరుగనున్న ఈ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ విషయమై సినిమా యూనిట్ ఇప్పటికే మెగాస్టార్ ని కలిసి ఆహ్వానించడం జరిగిందని,

 

అలానే మెగాస్టార్ కూడా తప్పకుండా వస్తానని మాటిచ్చినట్లు చెప్తున్నారు. మొదటి నుండి ఘట్టమనేని మరియు మెగా ఫ్యామిలిస్ మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో కృష్ణ, చిరంజీవి కలిసి పలు సినిమాల్లో నటించారు. అలానే మహేష్ నటించిన టక్కరి దొంగ సినిమా ఓపెనింగ్ కు ప్రత్యేకంగా విచ్చేసిన మెగాస్టార్, ఆ తరువాత తేజ దర్శకత్వంలో ఆయన నటించిన నిజం సినిమా ఆడియో ఫంక్షన్ కు కూడా విచ్చేసారు. ఇక ప్రస్తుతం సరిలేరు ఫంక్షన్ కు మెగాస్టార్ రాబోతున్నారు అనే వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది….!!

Read more RELATED
Recommended to you

Latest news