సినిమాలలో అనుష్క నటించకపోవడానికి కారణం అదేనా..?

-

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరని చెప్పవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో అనుష్క కాస్త సైలెంట్ గా ఉన్నది. ఇక తన సినిమాలు ఏవి రాక దాదాపుగా ఇప్పటికీ మూడు సంవత్సరాలు పైనే కావస్తోంది. అయితే ఇప్పటివరకు తన తదుపరిచిత్రం జాడ ఎక్కడ కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఈమె పైన పలు రకరకాలుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా అనుష్కకు అవకాశాలు రాలేదని , అందుకు కారణం ఆమె శరీరంలో పలు మార్పులు అన్నట్లుగా వార్తలు ఎక్కువగా వినిపించాయి. అంతేకాకుండా త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ కూడా బాగా వార్తలు వినిపించాయి.

కానీ ఇంతవరకు ఎలాంటి విషయం పైన కూడా ఈమె స్పందించలేదు. తెలుగులో గడిచిన కొన్ని నెలల క్రితం నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. అయితే కొంతమంది విశ్లేషకులు తెలిపిన ప్రకారం అనుష్క శెట్టి తాజా పరిస్థితిని చూస్తే ఇండస్ట్రీకి దూరమైందని వార్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమ కూడా అనుష్క శెట్టి ని మరిచిపోయింది అంటూ ఫిలిం సర్కిల్లో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అవకాశాలు లేకనే ఈమె దూరంగా ఉంటోంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

అయితే అనుష్క కేవలం యోగ టీచర్ కావాలనుకున్నది కానీ కొన్ని కారణాల చేత హీరోయిన్ గా అడుగు పెట్టడం జరిగింది. అదే స్థాయిలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమెకు పలు అవకాశాలు రావడం జరిగింది. ఇలాంటివన్నీ అనుకోని విధంగా అనుష్క శెట్టి ని తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాయని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కానీ అనుష్క ఇలా ఒక్కసారిగా కనపడకుండా ఉండడం ఎవరూ ఊహించలేదని, ఆమె అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. మరి అనుష్క అభిమానుల కోసం సడన్ సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news