ఓహో.. ప్రకృతికి మనమేం ఇచ్చామో.. మళ్లీ దాన్నే తిరిగిస్తుందన్నమాట..!

చూశారుగా పైన ఫోటో. ఏం కనిపిస్తున్నది మీకు అందులో. ఏముంది అంతా చెత్తాచెదారం.. అని అంటారా? అవును చెత్తాచెదారమే. ఆ చెత్తంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదా మీకు. అదంతా మనం పారేసిన చెత్తే. మనం ఎక్కడ పడతే అక్కడ పడేసిన చెత్తే. చెరువుల్లో, నదుల్లో, సముద్రాల్లో పడేసిన చెత్తే. అదే ఇప్పుడు మళ్లీ మన దగ్గరికి వచ్చేసింది.

ఇది కేరళలో కనిపించిన దృశ్యం. ఇప్పుడు కేరళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేరళ భారీ వర్షాలకు, భారీ వరదలకు ఎలా మారిపోయిందో తెలుసు కదా. ఇక.. వరదలు తగ్గాక కేరళలోని ఓ బ్రిడ్జిపై కనిపించిన దృశ్యమే ఇది. అంటే మనం ప్రకృతికి ఏమిస్తామో.. అదే మళ్లీ తిరిగి ఇచ్చేస్తుందన్నమాట. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఆ ఫోటోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.