ఆర్ ఆర్ ఆర్ లో ఎన్.టి.ఆర్ పక్కన ఒలీవియా మోరిస్ అద్భుతమట ..!

-

దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, అలానే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఫిక్షన్ కథతో హిస్టారికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందిస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటి అలియా భట్, ఎన్టీఆర్ కి జంటగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

రాజమౌళి తండ్రి విజయోంద్ర ప్రసాద్ కథని అందిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం ..కెకె సమెథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాంచి ఊపొచ్చే న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తున్న బ్రిటీష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ మద్య ఒక అద్భితమైన సాంగ్ ఉండబోతుందని ఆ సాంగ్ సినిమాలో చాలా హైలెట్ అవుతుందని తెలుస్తుంది.

1920ల నాటి వెస్ట్రన్ అండ్ ఇండియన్ స్టైల్ లో ఈ సాంగ్ నేపథ్యం ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కోరియోగ్రఫీ హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ చేయనున్నారని సమాచారం. రాజమౌళి సినిమాలలో సాంగ్స్ కి పెద్ద అట్రాక్షన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమాలో కూడా ప్రభాస్ తమన్నా ల మీద చిత్రీకరించిన సాంగ్ అలాగే మనోహరీ అన్న స్పెషల్ సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లో సాంగ్స్ అంతకంటే ఎక్కువగా పాపులర్ అయ్యోలా ప్లాన్ చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news