NBK 107లో ఐటెం సాంగ్..బాలయ్యతో విదేశీ భామ చిందులు

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య నటించిన చిత్రం ఇటీవల ‘అఖండ’ విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ బాలయ్య అభిమానులను ఆనందపరుస్తోంది. ‘క్రాక్’ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో NBK 107 ఫిల్మ్ చేస్తున్న బాలయ్య…నెక్స్ట్ ‘ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరు’ ఫేమ్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు.

NBK 107 ఫిల్మ్ కు సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ కు ‘అన్న గారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ఉందని తెలిపారు.

చంద్రిక రవి అనే ఆస్ట్రేలియా దేశానికి చెందిన యాక్ట్రెస్, మోడల్.. ఈ సాంగ్ లో బాలయ్యతో చిందేయనున్నారు. ఈ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేయగా, రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. సెట్స్ నుంచి ఫొటోలను మైత్రి మూవీ మేకర్స్ ట్వి్ట్టర్ వేదికగా షేర్ చేయగా, సోషల్ మీడియాలో అవి బాగా వైరలవుతున్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రుతి హాసన్ నటిస్తోంది. విలన్ రోల్ ను కన్నడ స్టార్ దునియా విజయ్ ప్లే చేస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news