బిజినెస్ ఐడియా: ఈ పంట వేస్తే రైతుల కలలు నెరవేరినట్లే.. లాభాలే లాభాలు..

-

డబ్బులను సంపాదించాలనే ఆలోచన అందరికి ఉంటుంది.. అది కూడా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాలను పొందే వాటి వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు.ముఖ్యంగా రైతులు..ఎప్పుడూ వేస్తున్న పంటలను వేసి లాభాలు లేక ఆత్మహత్య చేసుకొని చనిపోయే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది..ఈ మధ్య కాలంలో వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు జరిగాయి.ప్రస్తుతం రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న పంటల్లో వెనీలా కూడా ఉంది. మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎంతో మంది రైతులు వెనీలాను పండిస్తున్నారు.

 

కుంకుమ పువ్వు తర్వాత అత్యంత ఖరీదైన పంటగా వెనీలాయే. మడగాస్కర్, పపువా న్యూగినియా, భారత్, యుగాండా వంటి దేశాల్లో వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఐస్‌క్రీమ్‌లో వెనీలా ఫ్లేవర్ వాడకం 40 శాతం వరకు ఉంది. ఈ పండు సువాసన అద్భుతంగా ఉంటుంది. వీటిని కేకులు, ఐస్‌క్రీమ్‌లు, పర్ఫ్యూమ్స్, ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారు. వెనీలాలో వెనిలిన్ అనే రసాయన మూలకం ఉంటుంది. వీటి పండ్లు, విత్తనాలు క్యాన్సర్ వంటి వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తాయట. అంతేకాదు పొట్టను శుభ్రం చేయడం, వ్యాధి నిరోధక శక్తి పెంచడం మొదలగు సీజనల్ వ్యాధులను దూరం చేయడంలో ఎంతో మేలు చేస్తుంది.

అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.ఈ పంట సాగుకు గోధుమ రంగు నేలలు ఎంతో అనువుగా ఉంటాయి. నేల PH విలువ 6.5 నుండి 7.5 వరకు ఉంటే.. ఆ భూమిలో వెనిలా మొక్కలు బాగా పెరుగుతాయి. వెనిలా పండ్లు పొడవుగా ఉంటాయి. వెనిలా పుష్పించి.. కాయలు కాసి.. కోతకు రావడానికి దాదాపు 10 నెలల సమయం పడుతుంది. అనంతరం వాటి నుంచి విత్తనాలను వేరు చేస్తారు. ఈ విత్తనాలను అనేక ఆహార పదార్థాల తయారీలో వినియోగిస్తారు. ప్రస్తుతం మనదేశంలో కిలో వెనీలా విత్తనాల ధర రూ.40 నుంచి 50వేల వరకు పలుకుతున్నాయి..ఈ పంటను వేస్తే ఇక లాభాలే లాభాలు.. ఒక్కసారి వేస్తే కోటేశ్వరులు అవ్వడం ఖాయం.ఈ పంటను ప్రారంభించే ముందు వ్యవసాయ నిపునుల సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news