నాగబాబు కోసం జబర్దస్త్ బ్యాచ్ మొత్తం దిగొస్తుందట..!

మెగా బ్రదర్ నాగబాబు అనుకున్నట్టుగానే తమ్ముడు స్థాపించిన జనసేన నుండి లోక్ సభ బరిలో దిగుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుండి నాగబాబు జనసేన తరపున పోటీ చేస్తున్నారు. నాగబాబు తన ప్రచారం కోసం జబర్దస్త్ టీం మొత్తాన్ని రంగంలోకి దించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. జబర్దస్త్ లో అందరు నాగబాబుని గురువుగా భావిస్తారు. ఆయన ఆశీస్సుల వల్లే వారంతా ఎదిగారని వాళ్ల నమ్మకం.

అందుకే జబర్దస్త్ టీంలో కొందరిని తన ప్రచారంలో పాల్గొనేలా ప్లాన్ చేశాడట. ఇప్పటికే హైపర్ ఆది జనసేన తరపున ప్రచారం మొదలు పెట్టాడు. పవన్ అభిమానిగా హైపర్ ఆది ఎక్కడ జనసేన మీటింగ్ పెడితే అక్కడ వాలిపోతున్నాడు. ఇక నాగబాబు కోసం నర్సాపురంలో కూడా ఆది ప్రచారం చేస్తాడని తెలుస్తుంది. నర్సాపురంలో ఎలాగైనా నాగబాబు గెలిచి తన సత్తా చాటాలని చూస్తున్నారు. మరి జబర్దస్త్ టీం చేసే ప్రచారం మెగా బ్రదర్ కు ఎలా ప్లస్ అవుతుందో చూడాలి.

మరోపక్క జనసేన తరపున ప్రచారంలో మెగా హీరోలు కూడా పాల్గొంటారని తెలుస్తుంది. చిరంజీవి వస్తాడా రాడా అన్నది చెప్పలేం కాని రాం చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్ లు మాత్రం ఇప్పటికే జనసేన కోసం ప్రచారం చేసేందుకు షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారట. సో ఈసారి పొలిటికల్ పార్టీలకు సినిమా గ్లామర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.