త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న జబర్థస్త్ కెవ్వు కార్తీక్..!

-

మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశాన్ని దక్కించుకొని.. కంటెస్టెంట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన కెవ్వు కార్తీక్ ఆ తర్వాత టీం లీడర్ గా గుర్తింపు తెచ్చుకొని మంచి సక్సెస్ బాట పట్టారు. అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపించే ఈయన ఇప్పుడు జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు కాబోయే అమ్మాయిని హత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

కెవ్వు కార్తీక్ ఈ ఫోటో షేర్ చేస్తూ.. మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తే ఆ జీవితం మరింత హ్యాపీగా మారుతుందని కొంతమంది చెప్పారు. బహుశా ఆ హ్యాపీనెస్ అంటే ఇదేనేమో నా జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు నీకు ధన్యవాదాలు.. నీతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపారు కెవ్వు కార్తిక్.. ఇకపోతే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కలిసి ఫోటో దిగాడు కానీ ఆ అమ్మాయి ఎవరు అన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్ గానే ఉంచాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ముఖం కనిపించకుండా ఫోటో షేర్ చేయడం జరిగింది.

మొత్తానికైతే కెవ్వు కార్తీక్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు అని తెలిసి ప్రతి ఒక్కరు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2013లో జబర్దస్త్ ప్రారంభమైన తర్వాత 2015లో ఒక సాధారణ కంటెస్టెంట్గా వచ్చి ధనరాజ్ టీంలో చేరాడు. ఆ తర్వాత తిరుపతి ప్రకాశం టీం లో ఆరో కంటెంట్గా కనిపించిన ఈయన 2016లో ముక్కు అవినాష్ తో టీం లీడర్గా అవకాశం లభించింది. ఇక అప్పటినుంచి టీం లీడర్ గా కొనసాగుతూ సక్సెస్ బాటపట్టారు కెవ్వు కార్తిక్.

 

View this post on Instagram

 

A post shared by Kevvu Kartheek (@kevvukartheek)

Read more RELATED
Recommended to you

Latest news