Ugram : OTTలోకి వచ్చేసిన అల్లరి నరేష్ “ఉగ్రం”..ఎందులో అంటే !

-

అల్లరి నరేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కామెడీ పండించే నరేష్ ఇప్పుడు సీరియస్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలా తాను హీరోగా ప్రయత్నించిన మొదటి సినిమా “నాంది”. ఈ సినిమాను డైరెక్టర్ విజయ్ కనకమేడల అద్భుతంగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ మధ్య నరేష్‌ హీరోగా చేసిన ఉగ్రం మూవీ విడుదలై అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను దక్కించుకుని, సంచలన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాను ఎంతో పకడ్బందీగా ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్ కనకమేడల. ఇందులో నరేష్ పోలీస్ పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు, దీనితో అల్లరి నరేష్ కెరీర్ లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తాజాగా ఉగ్రం మూవీ ఓటిటిలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా జూన్ 2వ తేదీ నుంచి అంటే ఇవాళ్టి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థియేటర్లలో చూడని వారు.. ఇక ఓటీటీలో చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news