తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కోసం ‘ప్రత్యేక వెబ్‌సైట్’

-

తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రగతి మార్గంలో దూసుకెళ్తున్న తెలంగాణ నేటితో పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దశాబ్ది ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు చెందిన వివరాలను ఆ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

ఉత్సవాల ప్రాముఖ్యత, నిర్వహించే రోజువారీకార్యక్రమాలు, ప్రాధాన్యతారంగాలు, సమాచారం,ఫోటోలు, వీడియోలతో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి చెందిన వివరాలు, రైతుల కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు, పరిపాలన సంస్కరణలు, నూతన సచివాలయం నిర్మాణం, ప్రత్యేకతలు, వ్యవసాయశాఖ సాధించిన ప్రగతి, ఆర్థిక ప్రగతినివేదికలు, విద్యశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్‌లో తీసుకొస్తున్న సంస్కరణలు, తెలంగాణ సంస్కృతి వారసత్వానికి చేపడుతున్న కార్యక్రమాలను అందులో పొందుపర్చారు. ఎల్లారెడ్డిపేట తహసీల్థార్ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వెబ్‌సైట్‌ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news