రేటు పెంచిన జాతిరత్నం..?

ఒక్క హిట్టు చాలు సినీ పరిశ్రమలో తామేంటో ప్రూవ్ చేసుకోడానికి.. అలాంటి హిట్టు కొట్టి తన సత్తా చాటుతున్న వారిలో యువ హీరో నవీన్ పొలిశెట్టి ఒకరు. ఐదారేళ్ల క్రితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా, 1 నేనొక్కడినే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించిన నవీన్ ఏజెంట్ ఆత్రేయ సినిమాతో మెప్పించాడు. ఇక ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన జాతిరత్నాలు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో నవీన్ రేంజ్ పెరిగిందని చెప్పొచ్చు. పదును పెడితే కుర్రాడిలో స్టార్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని గుర్తించారు. అందుకే ఓ బడా నిర్మాణ సంస్థ నవీన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిందట.

Jathiratnam Naveen Polishetty Demand 5 Crores Remuneration

ఇక క్రేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో నవీన్ పొలిశెట్టి కూడా తన రెమ్యునరేషన్ పెంచేశాడని టాక్. ప్రస్తుతం సినిమాకు 5 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట నవీన్ పొలిశెట్టి. రెండంటే రెండే సినిమాలతో ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న నవీన్ 5 కోట్ల పారితోషికం అడుగుతూ షాక్ ఇస్తున్నాడని తెలుస్తుంది. తన రానున్న సినిమాల్లో కంటెంట్ మీద కూడాద్ దృష్టి పెడుతున్నాడట నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం యువి క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా సినిమా వస్తుందని టాక్.