వరల్డ్ రికార్డ్: 105 నిమిషాల్లో 36 పుస్తకాలు చదివిన 5 ఏళ్ల చిన్నారి..!

-

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఉంటూ చదువును నెగ్లెట్ చేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కు అలవాటు పడి.. తరచూ సోషల్ మీడియాలో లేదా ఆన్‌లైన్ ఆటలు ఆడుతూ లైఫ్‌ను స్పాయిల్ చేసుకుంటున్నారు. చదువును పక్కన పెట్టి.. డ్యాన్సులు, షార్ట్ వీడియోలు చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో కూడా ఓ చిన్నారి చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం అందరీ కళ్లు ఈ అమ్మాయి వైపే చూస్తున్నాయి. అతి చిన్న వయసులోనే ఏకంగా రెండు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

కియారా
కియారా

భారతీయ-అమెరికన్ అమ్మాయి కియారా కౌర్ (5 ఏళ్లు) ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్నారు. కియారాకు పుస్తకాలు చదవడం ఎంతో ఇష్టం. ఈ చిన్నారి ఏకంగా 105 నిమిషాల్లో 36 పుస్తకాలు చదివి వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకుంది. కియారా పేరు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఆడుకోవాల్సిన వయసులో ఇంతటి ఘనతను సాధించడంపై అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కియారా ప్రతిభను మెచ్చుకుని అందరూ ఆమెను ‘వండర్ చైల్డ్’గా పిలుస్తున్నారు.

కియారా తండ్రి చెన్నైకి చెందిన వారు. పెళ్లైన తర్వాత కియారా అమెరికా పుట్టింది. కియారా గురించి వాళ్ల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కియారాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం చాలా ఇష్టమన్నారు. మొదట్లో పుస్తకాలు చదవడం అలవాటు లేకున్నా.. ఆ తర్వాత తనని స్కూల్‌లో జాయిన్ చేయించామన్నారు. అప్పుడు ఆ స్కూల్ ఉపాధ్యాయుడు కియారా ట్యాలెంట్‌ను గుర్తించారన్నారు. రోజూ మంచి మంచి పుస్తకాలు చదివించడం అలవాటు చేశారన్నారు. కరోనా లాక్‌డౌన్‌లో కూడా కియారా పుస్తకాలు చదివేదన్నారు. గతేడాది దాదాపు 200 వరకు పుస్తకాలు చదివి ఉంటుందన్నారు. ఈ కాలంలో చిన్నపిల్లలు పుస్తకాలు పట్టుకోవడం ఘనం.. కానీ కియారా పుస్తకాలు చదివి ప్రపంచ రికార్డులు సాధించడం చాలా సంతోషంగా ఉందని కియారా తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news