రౌడీ హీరోకి బిగ్ షాక్..!

-

టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న యువ హీరో ఎవరు అంటే క్షణం ఆలోచించకుండా అందరు చెప్పే పేరు ఒకటే అతనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు నుండి టాక్సీవాలా వరకు అతను చేస్తున్న సినిమాలు అవి పొందుతున్న విజయాలు అందరికి తెలుసు. టాక్సీవాలాతో మరోసారి తన సత్తా ఏంటో చాటి చెప్పిన విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలతో పాటుగా కపిల్ దేవ్ బయోపిక్ గా వస్తున్న 83 సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని అన్నారు. రణ్ వీర్ సింగ్ కపిల్ పాత్రలో కనిపిస్తుండగా.. శ్రీకాంత్ రామాచారి పాత్రలో విజయ్ నటిస్తాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. కాని ఆ పాత్రలో నటించే విజయ్ కాదట.. విజయ్ ప్లేస్ లో కోలీవుడ్ స్టార్ జీవాని సెలెక్ట్ చేశారట. విజయ్ కాదన్నాడో లేక డేట్స్ అడ్జెస్ట్ కాలేక వద్దన్నాడో కాని 83 సినిమాలో విజయ్ దేవరకొండ ఉంటాడని ఆశపడిన ఫ్యాన్స్ కు ఇది నిరుత్సాహం కలిగించే వార్తే.

బాలీవుడ్ లో నటించేందుకు తాను సిద్ధమే అని ప్రకటించిన విజయ్ దేవరకొండ రానున్న రోజుల్లో క్రేజీ ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది. బాలీవుడ్ హీరోలు కూడా తన గురించి మాట్లాడుకునేలా చేసిన విజయ్ దేవరకొండ నేషనల్ స్టార్ గా ఎదుగాడతని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news