తమన్నా పెళ్లికి అడ్డుపడిన వెంకటేష్..!

251

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ధం పైగా కెరియర్ కొనసాగిస్తూ తన సత్తా చాటుతుంది. మంచు మనోజ్ శ్రీ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెర మీద ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి మళ్లీ హ్యాపీడేస్ సినిమాతో రీ ఎంట్రీ అదరగొట్టింది. అప్పటి నుండి స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన తమన్నా ఈమధ్య కెరియర్ అంతగా జోష్ లేదని తెలిసిందే. బాహుబలిలో అవంతిక పాత్రలో నటించినా పెద్దగా పేరు రాలేదు.

ఇక ఎలాగు అవకాశాలు రావడం లేదని.. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది తమన్నా. అయితే ఎఫ్-2 రూపంలో ఆమెకు సూపర్ హిట్ ఆమె పెళ్లికి అడ్డు పడ్డది. ఎఫ్-2 హిట్ అవడంతో తమన్నా పెళ్లి ఆలోచన మానుకుందట. అంతేకాదు చిరంజీవి, కొరటాల శివ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందట. మరో రెండు సినిమాలకు ఆమె సైన్ చేసిందట.

సో మొత్తానికి వెంకటేష్ తో నటించిన తమన్నా తన అవకాశాలు లేక పెళ్లికి రెడీ అవుతుండగా ఆమెకు హిట్ ఇచ్చి మళ్లీ లక్ కలిసి వచ్చేలా చేశాడు మన విక్టరీ వెంకటేష్. ఇక వెంకీ కూడా మల్టీస్టారర్ మేనియా కొనసాగిస్తూ ఎఫ్-2 తర్వాత వెంకీ మామ సినిమా చేస్తున్నాడు.