ఎన్టీఆర్‌-కొరటాల శివ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ?

-

RRR మూవీ తర్వాత జూ.ఎన్టీఆర్ స్పీడ్ కాస్త తగ్గింది. తన తదుపరి సినిమా ఇప్పటి వరకు షురూ చేయలేదు. మొన్నటిదాకా RRR మూవీ జపాన్ ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏంటని ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కానీ తారక్ మాత్రం ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే RRR తర్వాత తన తదుపరి మూవీ కొరటాల శివతో చేయబోతున్నట్లు ఎన్టీఆర్ గతంలోనే ప్రకటించాడు. ప్రకటన తప్ప ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఒక్క అప్​డేట్ కూడా రాలేదు.

ఈ క్రమంలో ఈ మూవీ టీమ్ త్వరలోనే NTR30 సెట్స్​పైకి వెళ్తున్నట్లు తెలిపింది. మూవీకి సంబంధించి డైరెక్టర్ కొరటాల శివ, డీఓపీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తమ వర్క్​ని స్పీడప్ చేశారని సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ టాపిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదేంటంటే.. తారక్​కు జోడీగా నటించబోయే హీరోయిన్​ గురించి తెగ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్​కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.

ఇటీవలే జాన్వీ తన మూవీ మిలీ ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తనకు టాలీవుడ్​లో వర్క్ చేయాలని చెప్పింది. అంతేకాకుండా తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని.. తారక్​తో పని చేయాలని ఉందని కూడా చెప్పింది. ఇప్పుడు NTR30లో జాన్వీని ఎంపిక చేసినట్లు వస్తున్న వార్తలు చూస్తుంటే ఈ బ్యూటీ ఆశ నెరవేరుతున్నట్లే కనిపిస్తోంది. ఇదే నిజమైతే మొత్తానికి జాన్వీ తనకు ఇష్టమైన టాలీవుడ్​లో తన ఫేవరెట్​ హీరో సినిమాతోనే ఎంట్రీ ఇస్తుందన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news