నా కూతురు లేచిపోయిందని ప్రచారం చేశారు – జీవిత

-

టాలీవుడ్‌ నటి జీవిత – రాజశేఖర్‌ కూతురు లేచిపోయిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై స్వయంగా టాలీవుడ్‌ నటి జీవిత – రాజశేఖర్‌ క్లారిటీ ఇచ్చారు. నా కూతురు లేచిపోయిందని ప్రచారం చేశారని ఆగ్రహించారు. నా కూతురు బాయ్ ఫ్రెండ్‌తో దుబాయ్‌కి వెళ్లిందని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు జీవిత.

అసత్యాలు ప్రచారం చేస్తే ఎంత మంది జీవితాలు ప్రభావితం చేస్తాయని నిప్పులు చెరిగారు. గరుడ వేగ సినిమా వివాదం కోర్టులో ఉందని.. కోర్టులో తేలకముందే ఏదో చెబుతున్నారని తెలిపారు. తప్పు చేస్తే ఏమైనా వేయండన్నారు జీవిత రాజశేఖర్. మొన్న ఫంక్షన్ లో నా వ్యాఖ్యలు అర్య వైశ్యుల ను బాధ పెట్టింటే క్షమాపణ కోరుతున్నానని జీవితా రాజశేఖర్ పేర్కొన్నారు. అయితే.. నా కూతురు లేచిపోయిందని ప్రచారం చేయడం చాలా అన్యాయం అని.. వాళ్లకు కుటుంబాలు ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు.. చూసుకోవాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news