NTR : ఆస్కార్ రేసులో ఎన్టీఆర్.. ఫ్యాన్స్​ దిల్ ఖుష్..!

-

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన విజువల్ ఆర్ఆర్ఆర్ సినిమాకు రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్.. అది కూడా దాటి ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది. ముఖ్యంగా విదేశీ ప్రేక్షకులు ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డుల పంట కూడా పండుతోంది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఈ సినిమా చూశామంటూ.. ఎంతో నచ్చిందంటూ హాలీవుడ్ డైరెక్టర్లు కూడా ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ మూవీ తర్వతా ఈ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పలికించిన హావభావాలకు పిచ్చి క్రేజ్ వచ్చింది. ఆర్​ఆర్​ఆర్​లో యాక్షన్‌ సీన్స్‌లోనే కాకుండే ఎమోషనల్‌ పరంగానూ తారక్‌ నటన కంటతడి పెట్టించింది. దీంతో ఆస్కార్‌ రేసులో ఉత్తమ నటుడి విభాగంలో తారక్‌ నిలుస్తారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మ్యాగజైన్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది టాప్‌-10 బెస్ట్‌ యాక్టర్స్‌ ప్రిడిక్షన్‌ లిస్ట్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్‌కు అగ్రస్థానం దక్కడం విశేషం. టామ్ క్రూజ్, పాల్ డనో, మియా గోత్, పాల్ మెస్కల్, జో క్రవిట్జ్ తదితరుల పేర్లు కూడా టాప్‌-10 లిస్ట్‌లో ఉన్నాయి.

Powered By
Video Player is loading.

ఇక ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. ఆస్కార్‌ నామినేషన్స్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈసారి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఏదో ఒక విభాగంలో అయినా ఆస్కార్‌ దక్కుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి కొమురం భీమ్‌ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ వరిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news