జక్కన్నతో మాట్లాడా.. సాయంత్రం 4 గంటలకు వస్తుందంటా : ఎన్టీఆర్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ సంభాషణ తెగ వైరల్ అవుతోంది. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీగా ఉందని, అది నేటి ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తానని ఎన్టీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పది గంటలకు ఒక్క ఐదు నిమిషాల ముందు ట్వీట్ చేస్తూ.. నిన్న రాత్రి మంతనాలు జరిగాయని, ఆ గిఫ్ట్ రాజమౌళి చేతికి వెళ్లిందని, ఇక ఆయన చేతికి వెళితే వ్యవహారం ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా క్షమించు సర్ ప్రైజ్ ఆలస్యం అవుతుందని రామ్ చరణ్‌ను క్షమించమని కోరాడు.

ఇక దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ.. ఏంటి ఆయన చేతికి ఇచ్చావా? నాకు ఈ రోజు వస్తుందా? అంటూ ఎన్టీఆర్‌పై ఫైర్ అయ్యాడు. ఇక రామ్ చరణ్‌కు కూల్ చేసేందుకు రాజమౌళితో ఎన్టీఆర్ సంప్రదింపులు చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. జక్కన్నతో ఇప్పుడే మాట్లాడా.. సాయంత్రం నాలుగు గంటలకు కచ్చితంగా వస్తుందని అన్నాడంటూ రామ్ చరణ్‌కు రిప్లై ఇచ్చాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news