చంపేస్తామంటూ ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి గంభీర్‌కు ఫోన్ కాల్స్..

-

బీజేపీ ఎంపీ, మాజీ స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌, ఆయన కుటుంబానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడడం ఆయన నైజం. ఏ అంశంపైన అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు. తాజాగా, ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరిస్తున్నారంటూ గంభీర్ పోలీసులను ఆశ్రయించారు.

తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గంభీర్ డీసీపీకి లేఖ రాశారు. గంభీర్ గత ఎన్నికల్లో ఢిల్లీ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లోక్ సభకు పోటీచేసి విజయం సాధించారు. గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news