ఫైట్స్ లేకుండా స్టార్ మల్టీస్టారర్..!

-

టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ తో పాటుగా వెంకటేష్, నాగ చైతన్య కలిసి మరో సినిమా చేస్తున్నారు. వీటితో పాటుగా వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఎఫ్-2 అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాలో అసలు ఫైట్స్ ఉండవని తెలుస్తుంది.

భర్యా బాధుతులుగా వెంకటేష్, వరుణ్ తేజ్ సినిమా మొదలైన నాటి నుండి ఎండ్ అయ్యే వరకు కామెడీ కితకితలు పెడతారట. ఈ సినిమాలో అసలు ఫైట్స్ ఉండని తెలుస్తుంది. ఫైట్స్ లేకుండా ఇద్దరు స్టార్స్ తో సినిమా అంటే సాహసమే అని చెప్పాలి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రష్ చూసిన సన్నిహితులు సినిమా పక్కా హిట్ అని చెబుతున్నారట.

సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీ కౌర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news