‘కల్కి’ ఓటీటీ డీటెయిల్స్​ ఇవే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

-

ఎన్నో రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు ‘కల్కి 2898 ఏడీ’ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రీమియర్ షో నుంచి పాజిటివ్ టాక్​ దక్కించుకుంది. సోషల్ మీడియా అంతా ఈ సినిమా రివ్యూ ముచ్చట్లే. సినిమా అద్భుతంగా ఉందంటూ ఎపిక్​ బ్లాక్ బస్టర్ అని​ అందరూ కామెంట్లు పెడుతున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఖాతాలో మరో హిట్ పడటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటీటీ) హక్కుల వివరాలు తెలిసిపోయాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. తమ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ప్రైమ్ వీడియో అని ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టైటిల్ కార్డ్స్ ముందు వేశారు. ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్ పాత్ర భైరవ, సూపర్ కార్ బుజ్జి ప్రధాన పాత్రలుగా ‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో ఒక వెబ్ సిరీస్ రూపొందించిన సంగతి తెలిసిందే. దాని మొదటి ఎపిసోడ్​ను అమెజాన్ ప్రైమ్​లో విడుదల చేశారు. మరొక ఎపిసోడ్​ త్వరలోనే విడుదల కానుంది. ఇక థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రానుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా జోరు ఎక్కువ రోజులు కొనసాగితే ఆలస్యంగా కావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news