ఎన్టీఆర్ సినిమాలో కళ్యాణ్ రామ్ ఫిక్స్

-

నందమూరి బాలకృష్ణ మొదలుపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో మిగతా నందమూరి హీరోల పాత్రల మీద అందరి దృష్టి ఉంది. బాలకృష్ణ తన ఫ్యామిలీకి సంబందించిన వారెవరిని ఇందులో పెట్టుకోబోతున్నాడని చాలా చర్చలే జరిగాయి. ఫైనల్ గా నందమూరి కళ్యాణ్ రాం మాత్రం ఎన్.టి.ఆర్ బయోపిక్ లో స్థానం సంపాదించుకున్నాడు. తన తండ్రి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రాం కనిపించబోతున్నారని తెలుస్తుంది.

అప్పట్లో ఎన్.టి.ఆర్ చైతన్య రథానికి హరికృష్ణ సారథిగా ఉన్నారు. అయితే మధ్యలో పార్టీలో తనకు ఎలాంటి గుర్తింపు లేదని దూరంగా ఉంటున్నారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్ రాం, జూనియర్ ఎన్.టి.ఆర్ ఈమధ్య మంచి సన్నిహితంగా ఉంటున్నారు. బాలకృష్ణ మాత్రం హరికృష్ణ, కళ్యాణ్ రాం, ఎన్.టి.ఆర్ లను దగ్గరకు రానివ్వడం లేదని టాక్.

మరి ఈ బయోపిక్ తో దూరం దగ్గరవుతుందని ఆశిస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. సినిమాలో ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తుంటే.. హరికృష్ణ గా కళ్యాణ్ రాం తన తండ్రి పాత్రలో నటించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news