సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కమల్ హాసన్ ఫొటో.!

-

కమల్ హాసన్ గురించి భారతీయ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్లు కొత్తగా మేముపాన్ ఇండియా స్టార్లు గా చెలామణి అవుతున్నారు.కాని ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందటే తన సినిమా లతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక తన భారతీయుడు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.

అప్పట్లో ఆ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ సినిమా కమల్ కు మరియు డైరెక్టర్ శంకర్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా కు సీక్వెల్ గా హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కలిసి  ‘ఇండియన్‌ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే.కమల్‌హాసన్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్‌ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కమల్ హసన్ ఇప్పటికీ అదే ఎనర్జీ తో నటిస్తూ ఉన్నాడు. తన వయస్సు దాదాపు డెబ్బై సంవత్సరాలు దగ్గరగా ఉంది అంటే మీకు నమ్మలేక పోవచ్చు. అంతలా ఫిట్ గా ఉండి ఆశ్చర్య పరుస్తున్నాడు.అయితే ఇప్పుడు కమల్ హాసన్ రీసెంట్ గా భారతీయుడు సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో లో వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి.

 

Read more RELATED
Recommended to you

Latest news