విశ్వ నటుడు, లోకనాయకుడు అని ప్రేక్షకులు పిలుచుకునే కమల్ హాసన్ తన నట జీవితానికి గుడ్ బై చెప్పే టైం వచ్చిందని తెలుస్తుంది. రాజకీయ పార్టీ పెట్టిన కమల్ 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రస్తుతం తను దర్శక నిర్మాతగా వ్యవహరించిన శభాష్ నాయుడు రిలీజ్ చేసి ఆ తర్వాత ఇండియన్-2 సినిమా చేస్తాడట కమల్ హాసన్. ఇక ఆ సినిమానే తన చివరి సినిమా అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు కమల్ హాసన్.
శంకర్ డైరక్షన్ లో ఇండియన్-2 సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. రెండు దశాబ్ధాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వల్ గా ఈ మూవీ వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత కమల్ సినిమాలను ఆపేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది కచ్చితంగా సిని అభిమానులకు చేదు వార్తే. ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి ప్రయోగాలకు పెద్ద పీట వేసే కమల్ సినిమాలను ఆపేయడం అంటే కచ్చితంగా షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు.