కమల్ విశ్వరూపం-2 వాయిదా

-

కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమా 2013లో వచ్చి సంచలన విజయం అందుకుంది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ గా విశ్వరూపం-2 రిలీజ్ కు రెడీ అయ్యింది. అసలైతే ఆగష్టు 10న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారని తెలుస్తుంది. తమిళనాడు మాజి ముఖ్యమంత్రి కరుణానిధి మరణం కారణంగా ఈ సినిమా వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈరోజు రేపు తమిళనాడు థియేటర్లు బంద్ ప్రకటించారు. తమిళనాడు మహా రాజకీయ నేత అయిన కరుణానిధి మృతి పట్ల తమిళ సిని పరిశ్రమ కూడా తీవ్ర ఆందోళన చెందుతుంది. కమల్, రజిని లాంటి వారు కరుణానిధిని కడసారి చూసేందుకు వచ్చారు. ఈ కారణంగా కమల్ విశ్వరూపం-2 సినిమా వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే చిత్రయూనిట్ నుండి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news