డర్టీ సీక్రెట్స్ తెలుసు కాబట్టే సుశాంత్ చచ్చిపోయాడు; కంగనా

-

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణంకు సంబంధించి ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేంద్రం రక్షణ కల్పిస్తే నార్కోటిక్స్ బ్యూరో కి సహాయ సహకారాలు అందిస్తా అని ఆమె పేర్కొంది. బాలీవుడ్ లో డ్రగ్స్ సర్వ సాధారణం అని ఆమె ఆరోపించింది తన ట్వీట్ లో.

డర్టీ సీక్రెట్స్ తెలిసాయి కాబట్టి సుశాంత్ సింగ్ చచ్చిపోయాడు అని ఆమె ఒక ట్వీట్ చేసింది. బాలీవుడ్ లో డ్రగ్స్ లో చాలా మంది ఉన్నారని ఆమె అంది. బాలీవుడ్ లోకి యాంటీ డ్రగ్స్ ఎంటర్ అయితే ప్రముఖులు అందరూ బయటకు వస్తారని ఆమె తన ట్వీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో ప్రముఖులు ఉన్నారని ఆమె విమర్శల బాణాలు వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news