మొబైల్స్ తయారీదారు షియోమీ కొత్తగా రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో గురువారం విడుదల చేసింది. ఇందులో 6.53 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్ ఉంది. 4జీబీ ర్యామ్ ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను అందించారు. వెనుక వైపు 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఇందులో ఉంది. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.
రెడ్‌మీ 9 స్పెసిఫికేషన్లు…
* 6.53 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్
* 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 10, 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ స్పోర్టీ ఆరెంజ్, స్కై బ్లూ, కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఆగస్టు 31 నుంచి అమెజాన్‌లో విక్రయిస్తారు.