గుర్రంపై స్వారి.. మరి ఇంత డూపా కంగనా..!

-

కంగనా రనౌత్ లీడ్ రోల్ లో ఝాన్సి లక్ష్మి భాయ బయోపిక్ గా వచ్చిన సినిమా మణికర్ణిక. క్రిష్ డైరక్షన్ లో మొదలైన ఆ సినిమా మధ్యలో కంగనా చేతుల్లోకి వెళ్లింది. కంగనా నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా మణికర్ణిక. జనవరి 25న రిలీజైన మణికర్ణిక సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో కంగనా వీరోచిత సన్నివేశాలపై అందరు ప్రశంసించారు.

అయితే ఎక్కడ నుండి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కాని కంగానా నటించిన మణికర్ణిక సినిమాలోని ఓ మేకింగ్ వీడియో బయటకు వచ్చింది. కంగనా రనౌత్ హార్స్ రైడింగ్ కు సంబందించిన ఈ వీడియోలో కంగనా ఎలట్రిక్ హార్స్ పై కనిపించింది. అది చూసిన ఆడియెన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా కోసం అంత కష్ట పడ్డాం ఇంత కష్టపడ్డా అని చెప్పే సెలబ్రిటీస్ ఇదేనా చేసేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

హార్స్ రైడింగ్ నేర్చుకున్నా అని చెప్పిన కంగనా ఇలా ఎలక్ట్రిక్ హార్స్ పై అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం మణికర్ణిక నుండి వచ్చిన ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news