సుశాంత్‌లా అభిషేక్ ఆత్మహత్య చేసుకుంటే.. జ‌యాబ‌చ్చ‌న్ కి కంగన సూటి ప్రశ్న..!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి రిమాండ్ లో ఉంది. అలాగే ఆమె తమ్ముడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ అంశమే బాలీవుడ్ ని కుదిపేస్తుంది. అయితే తాజాగా.. ఈ అంశంపై ఎంపీ జ‌యాబ‌చ్చ‌న్ స్పందించారు. రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ.. చిత్ర‌సీమ‌కు ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇవ్వాలి. కొంద‌రివల్ల మొత్తం సీని ఇండ‌స్ట్రీని తప్పుపట్టడం స‌రికాదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన న‌టులు మ‌నద‌గ్గ‌ర ఉన్నారు. అని జ‌యాబ‌చ్చ‌న్ తెలిపారు.

అయితే జ‌యాబ‌చ్చ‌న్ చేసిన ఈ వ్యాఖ్యలపై కంగన రనౌత్ స్పందిస్తూ.. జయా జీ నా స్థానంలో మీ కూతురు శ్వేత, సుశాంత్ స్థానంలో మీ కొడుకు అభిషేక్ ఉంటే ఇలాగే మాట్లాడేవారా? మీ కూతురు నాలా బాలీవుడ్‌లో దెబ్బలు తిని, డ్రగ్స్‌ కు అలవాటుపడి, లైంగిక వేధింపులకు గురైతే ఇలాగే మాట్లాడతారా? సుశాంత్‌లా మీ కుమారుడు ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే వ్యాఖ్యలు చేస్తారా?’ అని ట్వీటర్ వేదికగా ప్రశ్నించింది.