550 సార్లు రీ-రిలీజ్‌ అయిన మూవీ.. ఏంటో తెలుసా..?

-

ఒకప్పుడు ఏదైనా పండగ లేదా హీరోల పుట్టినరోజు సందర్భంగా వాళ్లు నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను రీ-రిలీజ్‌ చేసేవారు. ఈ మధ్య ఆ ట్రెండ్ మళ్లీ మొదలైంది.  పాత సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో అలా సూపర్ స్టార్ల హీరోల సినిమాలు రిలీజై రికార్డు వసూళ్లు సాధించాయి.

సాధారణంగా ఓ సినిమాను ఎన్నిసార్లు రీ రిలీజ్ చేస్తారు. రెండు లేదా మూడు. ఇక ఈ చిత్రానికి క్రేజ్ మరీ ఎక్కువగా ఉంటే మహా అయితే ఐదు సార్లు. కానీ ఓ సినిమాను ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ చేశారు. వామ్మో అనుకుంటున్నారా.. నిజమండూ బాబు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..  కన్నడ మూవీ ‘ఓం’ .

ఉపేంద్ర  దర్శకత్వంలో శివరాజ్‌కుమార్‌  కథానాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రేమ కథానాయిక. 1995 మే 19న (ఈ మే 19కు 28ఏళ్లు పూర్తి) విడుదలైన ఈ చిత్రం కన్నడనాట సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి (మార్చి 12, 2015 వరకూ) ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్‌ చేశారు. అత్యధికసార్లు రీరిలీజ్‌ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించింది.

Read more RELATED
Recommended to you

Latest news