కుంగిపోతోన్న న్యూయార్క్‌ నగరం.. కారణమిదే!

-

అమెరికాలోని న్యూయార్క్ నగరం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోని నగరాల్లో ది బెస్ట్ సిటీ ఇది. ఎటుచూసినా ఆకాశహార్మ్యాలతో ప్రపంచ దేశాలను ఆకట్టుకునే న్యూయార్క్‌కు.. ఆ భవంతులే శాపంగా మారాయా? అంటే అవునని తాజాగా వెలువరించిన ఓ అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది.

ఇక్కడి బహుళ అంతస్తుల భవనాల బరువు.. నగరాన్ని కుంగిపోయేలా చేస్తోందని అధ్యయనం పేర్కొంది. అమెరికా జియాలాజికల్‌ సర్వే సంస్థ, యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్‌లోని జియాలజిస్టులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ‘ఎర్త్ ఫ్యూచర్ జర్నల్‌ ’లో ప్రచురితమయ్యాయి.

పరిశోధకులు మొదటగా న్యూయార్క్‌ నగరాన్ని చతురస్రాకార గ్రిడ్‌లుగా విభజించారు. ఈ క్రమంలోనే దాదాపు పది లక్షలకుపైగా భవనాలు ఉన్నాయని తేల్చారు. వాటి బరువు దాదాపు 85 కోట్ల టన్నుల వరకు ఉంటుందని లెక్కగట్టారు. ఈ క్రమంలోనే నగరం ఏటా 1- 2 మిల్లీమీటర్ల మేర వేగంతో కుంగిపోతోన్నట్లు గుర్తించారు. నేల స్వభావం, ఉపగ్రహ సమాచారాన్ని విశ్లేషించి ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news