Karan Johar: ‘కాఫీ విత్ కరణ్’ షోపై కరణ్ జోహార్ కీలక ప్రకటన..నెటిజన్ల స్పందన ఇదే

-

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్..తన సినిమాలతో పాటు ‘కాఫీ విత్ కరణ్’ షోతో బాగా పాపులర్ అయ్యారు. ఈ షో లో పార్టిసిపేట్ చేసిన సెలబ్రిటీలను తనదైన శైలిలో క్వశ్చన్స్ అడిగి కరణ్ జోహార్ వారిని చాలా సార్లు ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ ‘‘కాఫీ విత్ కరణ్’’ షో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.

ఈ షో సూపర్ హిట్ అయింది కూడా. కాగా, తాజాగా ఈ షో విషయమై ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు కరణ్ జోహార్. ఇఖ ఈ షోను కంటిన్యూ చేయబోనని చేతులెత్తేశాడు. ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైన ఈ షో..మోస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని, అయినప్పటికీ ‘కాఫీ విత్ కరణ్’ మళ్లీ ఇక మీ ముందుకు రాబోదని తెలుపుతున్నానని అన్నారు కరణ్. ఈ విషయం చెప్పేందుకు తనకు బాధగా ఉందని కరణ్ జోహార్ పేర్కొన్నారు.

కరణ్ జోహార్ ట్వీట్ పైన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్ల లైఫ్ ను నాశనం చేసింది ఈ ‘కాఫీ విత్ కరణ్ షో’ అని, ఇది ఇక లేకపోవడమే మంచిదని’’ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కరణ్ జోహార్ ..రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ మూవీ ఆప్ డేట్ కోసం సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news