ట్రెండ్ ఇన్: RC15 షూట్ షురూ..వైజాగ్‌లో రామ్ చరణ్‌కు అభిమానుల ఘనస్వాగతం

-

RRR చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్ బేస్ పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో తన పాత్రలోని వేరియేషన్స్ ను అత్యద్భుతంగా చూపించి జనం చేత ప్రశంసలందుకున్నారు చరణ్. తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రంలోనూ రామ్ చరణ్ పాత్రకు చక్కటి మార్కులే పడ్డాయి.

‘ఆచార్య’ పిక్చర్ విడుదలైన ఫస్ట్ డే నుంచే కొంచెం డివైడ్ టాక్ వచ్చింది. అయితే, మూవీలో ‘సిద్ధ’ పాత్రలో రామ్ చరణ్ చాలా చక్కటి నటన కనబర్చారని అభిమానులు, సినీ లవర్స్ అంటున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే..రామ్ చరణ్ అప్పుడే తన నెక్స్ట్ ఫిల్మ్ పైన ఫోకస్ పెట్టేశారు. ప్రస్తుతం ఆయన RC15 షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.

ఏపీలోని వైజాగ్ లో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసిన నేపథ్యంలో బుధవారం రామ్ చరణ్ వైజాగ్ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఈ విషయం తెలుసుకుని అభిమానులు రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికారు. వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద అభిమానుల కోలాహలం జరిగింది. పూలు విసిరేసి , రామ్ చరణ్ తో ఒక్క సెల్ఫీ దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

ఈ ఏడాది చివరికల్లా RC15 షూటింగ్ కంప్లీట్ అయ్యే చాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పిక్చర్ లో రామ్ చరణ్..ఐఏఎస్., ఐపీఎస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే చరణ్ లుక్స్ కు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బ్యూటిఫుల్ కియారా అద్వానీ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news