ద్వారకా నగర రహస్య ఛేదనలో ‘కార్తీకేయ-2’..నిఖిల్ ఇంటెన్స్ లుక్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తీకేయ’ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్ ‘కార్తీకేయ-2’ అతి త్వరలో రాబోతున్నది. ఈ సినిమా నుంచి నిఖిల్ పుట్టిన రోజు (జూన్ 1) సందర్భంగా మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

‘కార్తీకేయ-2’ చిత్రం నుంచి ఫస్ట్ మోషన్ పోస్టర్ వీడియో రిలీజ్ చేశారు. పాన్ ఇండియా ఫిల్మ్ గా ఈ పిక్చర్ తెరకెక్కుతుండగా, అన్ని భాషల్లో వీడియో విడుదల చేశారు. ‘‘సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం ఈ ద్వారకా నగరం..’’ అని నిఖిల్ ఇంటెన్స్ గా చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

సముద్రంలో రక్షకుల మాదిరిగా అలా షిప్ లో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి నిలబడి ఉన్న సీన్ వీడియోలో వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ జూలై 22న విడుదల కానుంది.