దేశవ్యాప్తంగా కుతుబ్ మినార్, జ్ఞానవాపి, షాహీ ఈద్గా ఇలా పలు రకాల వివాదాస్పద అంశాలపై చర్చజరుగుతోంది. ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. అయితే తాజాగా మరో వివాదం ముందుకు వచ్చింది. హైదరాబాద్ చార్మినార్ వద్ద ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ లీడర్ రషీద్ ఖాన్ సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రారంభించారు. దీంతో మరోసారి వివాదం రాజుకుంది. ప్రస్తుతం ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియా చార్మినార్ ను రక్షిస్తోంది. అయితే రెండు దశాబ్ధాల క్రితం చార్మినార్ దగ్గర ప్రార్థనలు జరిగేవని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రార్థనలు చేసేందుకు అనుమతించాలని ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు సాంస్కృతిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించామని రషీద్ ఖాన్ అన్నారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పారని రషీద్ ఖాన్ వెల్లడించారు.
సిగ్నేచర్ క్యాంపెన్ తో తెలంగాణ సీఎం వద్దకు మా అభ్యర్థనను తీసుకెళ్తామని.. పరిష్కరించకపోతే ప్రగతి భవన్ వద్ద నిరశన దీక్ష చేస్తామని అన్నారు. రషీద్ ఖాన్ భాగ్యలక్ష్మీ ఆలయం గురించి కూడా మాట్లాడారు. మేము గంగా జమునా తహజీబ్‌ను నమ్ముతాము, ఆలయంలో ప్రార్థనలు జరుగుతుంటే జరగనివ్వండి, కానీ
అదే విధంగా, మా మసీదు మూసివేయబడింది దానిని తెరవాలని అన్నారు. కాంగ్రెస్ నేత సంతకాల ప్రచారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు
.