RRR కి ఆస్కార్ వెనుక అసలు రహస్యం బయటపెట్టిన కార్తికేయ..!

-

తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు లభించింది అంటే యావత్ భారతదేశం పొంగిపోయింది. అయితే కొంతమంది మాత్రం ఆస్కార్ క్యాంపెయిన్ కోసం కోట్లు గుమ్మరించారు. అవార్డును కొనుక్కున్నారు. అంటూ రకరకాలుగా తమకు నచ్చినట్లుగా విమర్శలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై తాజాగా రాజమౌళి తనయుడు , ఆర్.ఆర్.ఆర్ సినిమా లైన్ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ క్లారిటీ ఇచ్చారు.. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. విదేశీయులు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాపై మక్కువ చూపించారు.

అందుకే ఓటిటిలోకి వచ్చినప్పటికీ కూడా అమెరికాలో రిలీజ్ చేయాలని అనుకున్నాము. కేవలం ఒకరోజు 60 స్క్రీన్ లలో ప్రదర్శిద్దామనుకున్నాము. ఒకరోజు అనుకుంటే నెలరోజులు గడిచిపోయింది. సినిమా చూశాక అందులో మీకు నచ్చిన అంశం ఏమిటి ? అని అడగగా.. ప్రేక్షకులంతా చరణ్ ను తారక్ అన్న ఎత్తుకొని ఫైట్ చేసిన సన్నివేశం తెగ నచ్చిందన్నారు. పాటలు వస్తుంటే కూడా లేచి డాన్స్ చేస్తున్నారు.. కీరవాణి, చంద్రబోస్ ,జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , ప్రేమ్ రక్షిత్, కాలభైరవ్ లకు అకాడమీ ఆహ్వానం పంపింది. నామినీలకు , స్టేజిపై పెర్ఫార్మ్ చేసే వాళ్లకు అకాడమీ కమిటీ ఆహ్వానిస్తుంది . సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందాలు టికెట్ కొనాల్సిందే

ఇందుకోసం నామినేషన్ లో ఉన్నవాళ్లు కమిటీకి ఈమెయిల్ పంపుతారు.కీరవాణి , చంద్రబోస్ మాకోసం ఈమెయిల్ చేశారు. వాళ్లు అది చూసిన తర్వాత లింకు పంపుతారు. దాని ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. ఇక ఆ టికెట్లు కూడా రకరకాల క్లాసులు ఉంటాయి. దాంట్లో మేము లోయర్ లెవెల్ సీట్ల కోసం ఒక్కొక్కటి 1500 డాలర్లు పెట్టీ కొన్నాము. టాప్ లో కూర్చుని చూడడానికి మా కుటుంబంలో నలుగురికి 750 డాలర్లు పెట్టి టికెట్లు తీసుకున్నాను. ఆస్కార్ కొనడం అనేది పెద్ద జోక్.. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూట్ అది.. అక్కడ ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రేక్షకుల మన్ననలు కొనగలమా..? స్టీవెన్ స్టీల్ బర్గ్ జేమ్స్ కామరూన్ మాటలను కొనలేము కదా. ప్రచారం కోసం రూ.5కోట్లు బడ్జెట్ పెట్టుకున్నాము. మొదటి ఫేజ్ లో రూ.3 కోట్లు, నామినేషన్ అయ్యాక సెకండ్ ఫేజ్ లో కొంచెం ఖర్చయింది . మొత్తం రూ.8.5 కోట్లు ఖర్చయింది అంటూ కార్తికేయ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news