భారత్ కు నాలుగో స్వర్ణం… 75 కిలోల కేటగిరీలో లవ్లీనా గోల్డ్‌ పంచ్‌

భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే.. మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ 50 కిలోల కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలిచింది. అయితే ఇప్పుడు తాజాగా.. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు నాలుగో స్వర్ణం లభించింది. 75 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ పసిడి పతకం సాధించింది. ఇవాళ జరిగిన టైటిల్ బౌట్లో లవ్లీనా ఆస్ట్రేలియా బాక్సర్ కైట్లిన్ పార్కర్ ను ఓడించింది.Lovlina Borgohain overcomes Chinese giant to enter first Worlds final |  Sports News,The Indian Express

 

తొలి రౌండ్ ను లవ్లీనా చేజిక్కించుకోగా, రెండో రౌండ్ లో పార్కర్ పుంజుకుంది. ఆ తర్వాత వరుసగా మూడు రౌండ్లలోనూ లవ్లీనా ఆధిపత్యం కొనసాగింది. ఈ ఫైనల్ బౌట్ ను లవ్లీనా 4-1తో గెలిచి భారత్ కు స్వర్ణం అందించింది. ఈ చాంపియన్ షిప్ లో ఇప్పటికే నీతూ ఘంఘాస్ (48 కిలోలు), స్వీటీ బూరా (81 కిలోలు), నిఖత్ జరీన్ (50 కిలోలు) పసిడి పతకాలు గెలిచారు. 2006 నుంచి ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లలో భారత్ కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.