కోట్లు ఖర్చుపెట్టి ఖరీదైన కారు కొన్న కీర్తి సురేష్.. ఎంతంటే..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించింది కీర్తి సురేష్. తెలుగు,తమిళ భాషలో వరుస సినిమాలలో నటిస్తు బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక చివరిగా సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నది. ప్రస్తుతం కీర్తి సురేష్ తన తదుపరి సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నది. ఇక ఈ మధ్యకాలంలో కాస్త అందాల ఆరబోత చేస్తు సోషల్ మీడియాలో ఎక్కువగా తన సమయాన్ని కేటాయిస్తూ ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించి అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది కీర్తి సురేష్.

కీర్తి సురేష్ కొత్త కారు కొనుగోలు చేసిన విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంది. దసరా పండుగ సందర్భంగా కీర్తి సురేష్ కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేసినట్లుగా తెలియజేసింది బిఎండబ్ల్యూ x7 చెందిన కారుని కొనుగోలు చేశారని తెలుస్తున్నది ఈ కారు ధర సుమారుగా రూ. 1.30 కోట్ల రూపాయలు వరకు ఉంటుందని సమాచారం. కీర్తి సురేష్ తన కొత్త కారుకు సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక తన పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే..మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా లో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమాని నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈమధ్య తన అందాల ప్రదర్శనను చేస్తే కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కీర్తి సురేష్ కు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news