హాట్ టాపిక్ గా మారిన కియారా దంపతుల ఇల్లు..!

-

సినీ ఇండస్ట్రీలో జరిగిన సెలబ్రిటీల పెళ్లిళ్ళల్లో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ జాబితాలో ఇప్పుడు కియారా అద్వాని, సిద్ధార్థ్ మల్హోత్రాల జంట కూడా నిలిచింది. గత కొన్ని రోజులుగా ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న ఈ జంట ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీన వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉండగా వివాహం అనంతరం వీరు నివసించబోయే ఇంటి ఖరీదు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత మూడు రోజులుగా వీరి వివాహ వేడుకలు రాజస్థాన్లోని జై సల్మేర్ లోని సూర్య ఘర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగాయి.వీరి వివాహం ఫిబ్రవరి 6వ తేదీన జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ ఫిబ్రవరి 7వ తేదీన అంగరంగ వైభవంగా అతిరథ మహారధుల సమక్షంలో జరిగింది.

ఇకపోతే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రాకపోవడంతో పెళ్లి తర్వాతే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతారని సమాచారం. ఇదిలా ఉండగా పెళ్లి కోసం ఒక్క రోజుకు సుమారుగా రెండు కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా వీరి పెళ్లికి రూ.10 కోట్లకు ఇకపోతే ఇప్పటివరకు జరిగినటువంటి వివాహాలలో అత్యంత ఖరీదైన వివాహాలలో వీరి పెళ్లి కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా వివాహం అనంతరం ముంబైలో సెలబ్రిటీలు నివసించే జుహూ ప్రాంతంలో వీరు ఉండబోతున్నారట . ఈ ఇల్లు రూ.70 కోట్లకు పైగా ఖరీదు చేస్తుందని సమాచారం.

అంతేకాదు 3500 స్క్వేర్ ఫీట్స్ ఉన్న ఈ బంగ్లా అన్ని సౌకర్యాలతో నిర్మించబడి ఉంది అని తెలుస్తోంది. మొత్తానికి కియారా – సిద్ధార్థ్ మాత్రం బాగానే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బాగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news